అంతర్జాతీయం

కాలిఫోర్నియా బార్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థౌజండ్ ఓక్స్ (యూఎస్), నవంబర్ 8: కాలిఫోర్నియాలోని ఒక బార్‌లో గురువారం సాయుధుడైన వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి సహా 12మంది మృతి చెందారు. సంఘటన జరిగిన సమయంలో బార్‌లో కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నట్టు ప్రత్యక్షసాక్షి తెలిపారు. లాస్‌ఏంజెల్స్ శివారులో ఉన్న ఈ బార్‌లో సంఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడు అప్పటికే మృతి చెంది ఉన్నాడు. బార్‌లో కాల్పులు జరిపిన తర్వాత అతడిపై పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లోనో, లేక ఆత్మహత్య చేసుకోవడంవల్లో మృతి చెంది ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతిచెందారని కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు తెలియరాలేదని ఒక అధికారి తెలిపారు. కాల్పులకు తెగబడిన సంఘటనల్లో గత రెండువారాల్లో ఇది రెండవది. బుధవారం రాత్రి 11.20 గంటలకు నల్ల ట్రెంచ్ కోట్ ధరించి వచ్చిన ఒక వ్యక్తి బార్‌లోకి ప్రవేశించిన అనంతరం పలు స్మోక్ గ్రనేడ్‌లు విసిరాడని, అనంతరం కాల్పులు జరిపాడని, సంఘటనా స్థలమంతా రక్తంతో తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఈ సంఘటన వెనుక ఉగ్రవాద హస్తమేమన్నా ఉందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదని అధికారి జాఫ్ డీన్ తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కాల్పుల్లో మృతి చెందిన పోలీస్ అధికారి పేరు రోన్ హెలుస్ అని, అతను ఈ శాఖలో 29 సంవత్సరాలుగా సేవలందిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు షార్ట్ బేరల్ పిస్టల్‌తో 10-15 రౌండ్లు వరకు కాల్పులు జరిపాడని సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన విద్యార్థి ఒకరు తెలిపారు. తాను సహచర విద్యార్థి ఒకరు బాల్కనీ నుంచి కిందకు దూకి ఈ కాల్పుల నుంచి తప్పించుకున్నట్టు చెప్పాడు.