అంతర్జాతీయం

యుద్ధం వద్దు.. శాంతే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 11: మొదటి ప్రపంచ యుద్ధ భయానక అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకుని ప్రపంచ సమాజం శాంతిబాట పట్టాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రన్ పిలుపునిచ్చారు.
పరస్పరం భయభ్రాంతులను చేసుకోవడం మాని శాంతి, సామరస్యాలకు ప్రపంచదేశాలు పాటుపడాలని భవిష్యత్ తరాలకు ఆశాజనకమైన వాతావరణాన్ని కల్పించాలని మాక్రన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 60 దేశాల అధ్యక్షులు, ప్రధానుల సమక్షంలో ఆదివారం ఇక్కడ మాట్లాడిన మాక్రాన్ ప్రపంచ నేతలు ఆధిపత్య ధోరణిని విడనాడాలని, హింసకు స్వస్తి పలికి ప్రపంచ శాంతి, సంక్షేమం కోసమే పాటుపడాలని కోరారు. కలసికట్టుగా పనిచేస్తే భూతాపం, హింసా విధ్వంసకాండలు, పేదరికం, ఆకలిచావులు, వ్యాధులు, అసమానతలు, అజ్ఞానాలను తరిమికొట్టవచ్చునని ఆయన ఉద్ఘాటించారు. వందేళ్ల క్రితం జరిగిన అత్యంత భయానక మారణకాండ చేదు జ్ఞాపకాలు, మాయని మచ్చలు ఇప్పటికీ మానవాళిని వెంటాడుతున్న విషయాన్ని ప్రపంచ నేతలు మరువరాదని అన్నారు. కాగా, మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమంలో ప్రపంచ నేతలతో పాల్గొన్నారు. ఫ్రాన్స్ రాజధాని నగరమైన పేరిస్‌లో చారిత్రక ఆర్క్‌డేట్రియాంపేలో ఈ సంస్మరణ కార్యక్రమం జరిగింది.

చిత్రం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వెంకయ్య కరచాలనం