అంతర్జాతీయం

ఆశావహంగా ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 24: భారత్, చైనా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చైనాలోని దుజియాంగ్యాన్ పట్టణంలో శనివారం చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ మధ్య జరిగిన చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని చైనా పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి హోదాలో వాంగ్ యూ తొలిసారిగా ఈ చర్చలకు హాజరయ్యారు. ఇంతవరకు చైనా,్భరత్ మధ్య 21సార్లు చర్చలు జరిగాయి. నిరంతరం చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే సరిహద్దు సమస్యలు, ఇతర అంశాలను పరిష్కరించుకోవచ్చని చైనా అభిలాషిస్తున్నట్లు చైనా మంత్రి వాంగ్ యూ చెప్పారు. సరిహద్దుల వెంట శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని చైనా ప్రతినిది గెంగ్ షుంగ్ చెప్పారు. గత ఏడాది ఇరుదేశాధినేతల మధ్య చర్చలుజరిగిన తర్వాత వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. భారత్ నుంచి బియ్యం, చక్కె, ఫార్మాసూటికల్స్ ఎగుమతి అవుతున్నాయి. ఇరుదేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు హాజరై వాణిజ్య ఎగుమతులు, దిగుమతుల అంశాలను కూడా చర్చిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్-చైనా మధ్య 3448 కి.మీ పొడువున సరిహద్దు ఉంది. చర్చలు ఫలప్రదమయ్యేందుకు ముందు ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు నెలల తరబడి కసరత్తు చేశారు. ఈ చర్చలు ఇరుదేశామధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు ఉపకరిస్తాయని చైనాప్రతినిధి చెప్పారు. ఇరుదేశాలకు చెందిన రక్షణ శాఖాధికారులు కూడా తరచుగా సమావేశమైన చర్చించాలని గత సమావేశంలో నిర్ణయించారు.

చిత్రం..చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం