అంతర్జాతీయం

మీ జోక్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 6: కొత్త దలైలామా ఎంపిక టిబెట్ మత సంప్రదాయాల ప్రకారమే జరగాలి తప్ప అందులో చైనా దేశం పాత్ర ఎంతమాత్రం ఉండరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికార యంత్రాంగం భావిస్తోంది. తాను సూచించిన వ్యక్తినే దలైలామాగా నియమించాలని చైనా దేశం భావిస్తున్న నేపథ్యంలో దీనిని అమెరికా వ్యతిరేకించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మతగురువుల నియామకం వంటివి కేవలం మత సంస్థలు, మతాధికారులు తీసుకోవాలే తప్ప అందులో వేలుపెట్టే హక్కు ఏ దేశ ప్రభుత్వాలకు ఉండరాదని అమెరికా తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల స్టేట్ సెక్రటరీ లారా స్టోన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో ‘ఒకవేళ చైనా కనుక కొత్త దలైలమాను నియమించడానికి ప్రయత్నిస్తే అమెరికా స్పందన ఏమిటి? అని సెనేటర్ కోరి గార్డెనర్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఆ నియామకాన్ని అమెరికా గుర్తించదని స్పష్టం చేశారు. దీనిపై భవిష్యత్‌లో జరిగేదేమీటో తాను కచ్చితంగా ఊహించలేనని, అయితే దలైలమా నియామకంలో మతసంస్థల ప్రమేయం ఉండాలి తప్ప ఇతర దేశాలది కాదని అన్నారు. ఈ సంఘటనతో దలైలమా నియామకంలో అమెరికా తన వైఖరి చెప్పకనే చెప్పిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.