అంతర్జాతీయం

అంగారక గ్రహం నుంచి ‘ఇన్‌సైట్’్ఫటోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 7: నాసా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన ఇన్‌సైట్ లాండర్ అంగారక గ్రహం ప్రయోగం విజయవంతమైంది. ఇన్‌సైట్ లాండర్ రోబోటిక్ ఈ గ్రహంపై పనిచేసే దృశ్యాలు వచ్చాయని అమెరికా నాసా సంస్థ పేర్కొంది. నవంబర్ 26వ తేదీన లాండర్ నుంచి రోబో బయటకు వచ్చి కొన్ని సాంకేతిక పరికరాలను ఉపరితలం మీద పేర్చుతున్న దృశ్యాలు వచ్చాయన్నారు. లాండర్ ముందున్న భూభాగ ప్రదేశాలను రోబో కెమెరాలు ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఇమేజస్ వల్ల అంగారక గ్రహంలో ఉష్ణోగ్రతలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంగారక గ్రహంపైన వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు తొలిసారిగా రోబో సాంకేతిక పరికరాలను ఉంచినట్లు నాసా సంస్థ తెలిపింది.
ఈ వివరాలను నాసా శాస్తవ్రేత్త , ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్ బ్రూస్ బనేర్టెడ్ తెలిపారు. రోబో పనిచేస్తున్న తొలి దృశ్యాలను ఈ రోజు తాము చూడగలుగుతున్నామన్నారు. వచ్చే వారానికి మరింత స్పష్టమైన దృశ్యాలను స్వీకరించే అవకాశం ఉందన్నారు. లాండర్స్ అడుగుభాగాన కంటెక్ట్స్ కెమెరాను అమర్చామన్నరు. వర్క్‌స్పేస్ పని వివరాల ఇమేజస్ కూడా వస్తున్నాయన్నారు. కాగా లెన్స్‌కు దుమ్ముపట్టినట్లు భావిస్తున్నామన్నారు. కాని దీని వల్ల కెమెరా పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉండబోదన్నారు. తాము ప్రయోగించిన ఇన్‌సైట్ లాండర్‌లోని అన్ని వ్యవస్థలు, ఇంజనీరింగ్ విభాగాలు బాగా అనుసంధానంతో పనిచేస్తున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులను పేలోడ్ సెన్సర్ సబ్‌సిస్టమ్ అంచనా వేస్తోందన్నారు.