అంతర్జాతీయం

మరింత మంది విదేశీ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, డిసెంబర్ 8: దేశం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న కార్మికుల కొరతను తీర్చేందుకు విదేశీ కార్మికులను తీసుకొచ్చే ఒక వివాదాస్పద చట్టాన్ని జపాన్ ప్రభుత్వం శనివారం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి షింజో అబేకు చెందిన అధికార సంకీర్ణం ప్రతిపక్షాల వ్యతిరేకతను పట్టించుకోకుండా దేశంలోకి మరింత మంది బ్లూకాలర్ కార్మికులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన చట్టాన్ని రూపొందించే ప్రక్రియను పూర్తి చేసింది. ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించడంతో అది చట్టరూపం దాల్చింది. దిగువ సభ నవంబర్ నెల చివరలోనే ఈ బిల్లును ఆమోదించింది. రెండు సభల్లోనూ ప్రధాని అబేకు చెందిన అధికార పక్షానికి మెజారిటీ ఉండటంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. కొత్త చట్టం అమలులోకి రావడంతో జపాన్ ప్రభుత్వం నిర్మాణ, ఆహార సేవలు, నర్సింగ్ తదితర రంగాలలోకి గరిష్ఠంగా 3,45,000 మంది విదేశీ కార్మికులను అయిదేళ్ల కాలపరిమితి కోసం తీసుకు రావాలని భావిస్తోంది. ‘ప్రస్తుతం తీవ్రమయిన కార్మికుల కొరత ఉన్నందున దానిని తీర్చడానికి కొత్త వ్యవస్థను వేగంగా ప్రారంభించవలసి ఉంది. అందువల్ల వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లోనే దీనిని ప్రారంభిస్తాం’ అని ప్రధానమంత్రి షింజో అబే గురువారం పార్లమెంటుకు చెప్పారు. అయితే, జపాన్ సమాజంపై కొత్త విదేశీ కార్మికుల వల్ల కలిగే తీవ్రమయిన ప్రభావాన్ని పరిష్కరించడంలో, విదేశీ కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ఈ కొత్త చట్టం విఫలమయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కొత్త బిల్లు ఆమోదం పొందకుండా చూసేందుకు ప్రతిపక్షాలు ప్రధాని అబే, న్యాయశాఖ మంత్రి తకషి యమషితలకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. కాని, ఈ తీర్మానం సులభంగానే ఓడిపోయింది. తీవ్రమయిన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న రంగాలలోకి నైపుణ్యం గల కార్మికులను తీసుకు రావడానికి అయిదేళ్ల కాల పరిమితితో వీసాలు జారీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది. అయితే, సదరు కార్మికులు తమ కుటుంబ సభ్యులను జపాన్‌కు తీసుకు రావడానికి వీలులేదు. విదేశీ కార్మికులు వీసాను పొందడానికి పటిష్టమయిన అర్హతలు కలిగి ఉండటంతో పాటు కఠినమయిన జపాన్ భాష పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.