అంతర్జాతీయం

మా అభివృద్ధి ఫలాలు మీకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డర్బన్, జూలై 9: ప్రపంచంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, తమ దేశ ఆర్థికాభివృద్ధి ఫలాలను ఆఫ్రికా ఖండానికి, ముఖ్యంగా దక్షిణాఫ్రికాకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరముందని ఆయన అంటూ, శతాబ్దాలుగా మన రెండు దేశాల ప్రజలమధ్య ఉన్న బలమైన సంబంధాలు నేటి భాగస్వామ్యం నిర్మాణానికి బలమైన పునాది అవుతుందని అన్నారు. దక్షిణాఫ్రికాలో తన రెండు రోజుల పర్యటన చివరి కార్యక్రమంగా శనివారం రాత్రి తన గౌరవార్థం డర్బన్ మేయర్ ఇచ్చిన విందు సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మన భవిష్యత్తులో ఎదురయ్యే గొప్ప అవకాశాలను రెండు దేశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ‘ఇప్పుడు భారత దేశంలో ఆర్థిక మార్పు సంభవిస్తోంది. అలాగే దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండంలో ప్రముఖ ఆర్థిక శక్తులలో ఒకటి. మన రెండు దేశాల వాణిజ్యం, పెట్టుబడుల భాగస్వామ్యం ఇప్పటికే గణనీయమైనది’ అని మోదీ అన్నారు. ‘పరస్పర ఆధారితమైన నేటి ప్రపంచంలో భారత దేశ అభివృద్ధి గాథ ప్రపంచంలోనే ఉజ్జ్వలమైన వాటిలో ఒకటి. అయితే భారత దేశ ప్రగతి ఒక్క మా సమాజానికే కాదు, మొత్తం ఆఫ్రికా ఖండానికి, దక్షిణాఫ్రికా లాంటి మా మిత్రులకూ మన మైత్రీబంధం ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు.