అంతర్జాతీయం

ఈజిప్టులో 40 మంది ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, డిసెంబర్ 29: ఈజిప్టులోని శనివారం జరిగిన వివిధ దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గిజాపిరమిడ్ల వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు వియత్నాం పౌరులు మరణించిన ఘటనకు ప్రతీకారంగా ఈజిప్టు భద్రతాబలగాలు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. గిజా పరిధిలో జరిగిన దాడుల్లో 30 మంది ఉగ్రవాద అనుమానితులను, ఉత్తర సినాయ్ వద్ద నిర్వహించిన దాడిలో మరో పది మంది ఉగ్రవాద అనుమానితులను భద్రతా బలగాలు హతమార్చినట్లు ఈజిప్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడుతున్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు జరిపాయి. దేశ పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు పోలీసులు చెప్పారు. ఇంకా క్రైస్తవ ప్రార్థన మందిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు పక్కా సమాచారం లభించినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున ఆయుధాలను,బాంబులు తయారీకి ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శఉక్రవారం గిజా పిరమిడ్ల వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలోముగ్గురు వియత్నాం పౌరులపై దాడి చేసి చంపారు. ఈ బాంబుల దాడిలో ఈజిప్టుకు చెందిన డ్రైవర్ గాయపడ్డారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల దాడులతో ఈజిప్టులోని పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.