అంతర్జాతీయం

ఇజ్రాయిల్ మాజీ మంత్రికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, జనవరి 9: దేశంలో గూఢచార్య కలాపాలను నిర్వహించి శతృదేశమైన ఇరాన్‌కు పలు రహస్యాలను చేరవేసాడన్న ఆరోపణపై ఇజ్రాయిల్ మాజీ మంత్రికి జైలు శిక్షను విధించారు. ఇతనికి 11 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చునని ప్రాసిక్యూటర్లు తెలియజేసినట్టు ఇజ్రాయిల్ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ బుధవారం తెలియజేసింది. 1995-96లో ప్రధాని ఇజ్‌తక్ రేబిన్ కేబినెట్‌లో ఎనర్జీ, వౌలిక రంగ శాఖ మంత్రిగా పనిచేసిన గొనెన్ సెగావ్ శత్రుదేశంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిరంతరంగా దేశ రహస్యాలు పంపించడం ప్రారంభించాడని ఆతనిపై ఆరోపణ. దీంతో అతనిపై కేసు నమోదు చేసి గత ఏడాది జూలైలో జైలుకు పంపించారు. కాగా, బుధవారం విచారణకు వచ్చిన ఈ కేసులో అతనికి జైలు శిక్షను నిర్ధారించారు. అయితే ఎంతకాలం జైలు శిక్ష విధించేది ఫిబ్రవరి 11న తెలుస్తుందని అధికారులు చెప్పారు. కనీసం అతనికి 11 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని వారు తెలిపారు.