అంతర్జాతీయం

జాతీయ ఎమర్జన్సీ దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 11: తన పంతాన్ని నెగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ జాతీయ ఎమర్జన్సీని విధించి మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి సమాయత్తమవుతున్నారు. ఈ దిశగా ట్రంప్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. డెమాక్రట్లకు కాంగ్రెస్‌లో మెజార్టీ ఉంది. దీంతో డెమాక్రట్లు గోడ నిర్మాణానికి మోకాలడ్డుతున్నారు. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా, వారి అభిప్రాయంతో పనిలేకుండా ఎమర్జన్సీ విధించి మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి వెళ్లే హక్కు అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్, డెమాక్రట్లు ఎవరికి వారు భీష్మించుకుని కూర్చోవడం వల్ల 21 రోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయి. ఇంత సొమ్ము ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎందుకని డెమాక్రట్లు నిలదీస్తున్నారు. ట్రంప్ గురువారం దక్షిణ టెక్సాస్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనా గోడ నిర్మాణానికి మొగ్గు చూపుతామన్నారు. ఎమర్జన్సీ విధించడమనేది చివరి ఆఫ్షన్ అన్నారు. అక్రమ వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సాలీనా 250 బిలియన్ డాలర్ల నష్టంవస్తోందన్నారు. దక్షణ సరిహద్దుల ద్వారా వచ్చే అక్రమ వలసదారుల వల్ల నేరాల రేటు పెరుగుతోందన్నారు. సరిహద్దు గోడ ఉంటే ఈ తరహా పరిణామాలు తలెత్తవన్నారు.