అంతర్జాతీయం

మార్పు కోరుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 12: భారత్‌లో గత నాలుగున్నరేళ్లలో అసహనం, ఆగ్రహం పెరిగిందని, మతతత్వశక్తుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ సంస్కృతి సహనానికి మారుపేరని, తన భావజాలాన్ని ఇతరులపై ఎప్పుడూ బలవంతంగా రుద్దదని ఆయన చెప్పారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారతీయ ప్రజల ఆలోచనలతోనే ఈ దేశం భావాలు ప్రతిబింబిస్తుంటాయన్నారు. ఇతరులు చెప్పేది వినడం భారత సంస్కృతిలో భాగమన్నారు. ఐఎంటీ దుబాయ వర్శిటీలోవిద్యార్థులతో ఆయన వివిధ అంశాలపై ముచ్చటించారు. భారత సంస్కృతిలో సహనం ఒక భాగం. ఇది సమ్మిళితమై ఉంటుంది. కాని ఈ రోజు మతతత్వశక్తుల వల్ల అసహనం పెచ్చుమీరుతోంది. వివిధ వర్గాల మధ్య అసహనం పెరుగుతోందన్నారు. తమ భావాలను చెప్పేవారిపై దాడులు జరుగుతున్నాయి. ఈ తరహా విధానాలను భారత్ ప్రజలు అనుమతించరన్నారు. దేశం మార్పు కోరుతోంది. ఇప్పుడున్న పరిస్థితి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అభిప్రాయాలను ప్రజలు స్పష్టం చేయనున్నారని చెప్పారు. భారత్‌లో వైద్య ఆరోగ్య రంగానికి మంచి రోజులు రానున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా
ఆరోగ్య సేవల రంగం అభివృద్ధికి తగిన అవకాశాలు భారత్‌లో ఉన్నాయన్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మానవ వనరులు ఉన్న దేశం భారత్ అన్నారు. 20వ శతాబ్ధంలో మేధో వలసలు జరిగాయన్నారు. 21వ శతాబ్ధంలో ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లడం వల్ల మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. మాతృదేశం అన్ని రకాల ఉద్యోగావకాశాలకు వేదిక కావాలని కోరుకుంటామన్నారు. భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు చౌకగా, సులువుగా లభిస్తాయన్నారు.
అంతకు ముందు రాహుల్ గాంధీ యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులతో కూడా ఆయన ముచ్చటించారు.

చిత్రం..దుబాయ్ లో జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్