అంతర్జాతీయం

షట్‌డౌన్‌కు తాత్కాలిక తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 26: మెక్సికో గోడకు నిధుల విడుదలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తాత్కలికంగా తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఈ విషయమై నిరంతరం చర్చల జరిపి అందరి ఆమోదంతో ముందుకెళుతానని తెలిపారు. హౌస్, సెనెట్‌లో చర్చలు కొనసాగుతాయని, గోడపై వెనక్కు తగ్గలేదని, కాని ఈ విషయమై సమ్మెలో ఉన్న 8లక్షల మంది ఉద్యోగులు విధులకు హాజరు కావాలని కోరారు. దీంతో 36 రోజులుగా సమ్మెలో ఉన్న ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. దేశ భద్రతకు అవసరమైన 5.7 బిలియన్లు ఖర్చయ్యే గోడ నిర్మాణంపై వెనక్కు పోనని ట్రంప్ చెప్పడం గమనార్హం. రాజకీయ పరిశీలకులు మాత్రం ట్రంప్ వెనక్కు తగ్గినట్లు చెప్పకపోయినా, ఇది పెద్ద దెబ్బ అని మాత్రం తేల్చారు. బడ్జెట్ సమావేశాలనుకూడా నిర్వహించనని, గోడ తేలేవరకు ఈ నిధులు విడుదల చేయనని ట్రంప్ మొండికేసిన విషయం తెలిసిందే. హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో పాటు హౌస్, సెనెట్‌లో వచ్చే రోజుల్లో చర్చలు జరిపి ఫిబ్రవరి 15 లోపల ఒక పరిష్కారాన్ని ఏకాభిప్రాయంతో కనుగొంటామమని ట్రంప్ చెప్పారు. గోడ కోసం జాతీయ ఎమర్జన్సీని కూడా విధస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే. వచ్చే నెల 15వ తేదీ వరకు వేచి చూస్తామని, దేశ భద్రత తనకు ముఖ్యమని, ఆ లోగా పరిష్కారం లభించని పక్షంలో తప్పనిసరిగా తనకు ఉన్న ఆఫ్షన్లు ఉపయోగిస్తానని ట్రంప్ చెప్పారు. డెమాక్రట్లు, రిపబ్లికన్లు మాత్రం తాత్కాలికంగా ఈ వివాదానికి తెర పడిందని, కాని సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు.