అంతర్జాతీయం

ట్రంప్ లొంగిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 27: అమెరికా దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్‌తో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని తిరిగి తెరవడంపై సంప్రదాయవాదులు పెదవి విరుస్తున్నారు. ట్రంప్ ఒత్తిళ్లకు లొంగిపోయారని పేర్కొంటూనే, ఆయన గోడ నిర్మించి తీరుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ను బలపరుస్తున్న సంప్రదాయవాదుల్లో కొంత మంది మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని దయనీయమయినదిగా, పిరికితనంతో కూడినదిగా అభివర్ణిస్తున్నారు. మరికొంత మంది ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంతగా తప్పుపట్టడం లేదు. అయితే, సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసే అంశం ఉంటేనే ప్రభుత్వ సాయానికి సంబంధించిన ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయాలని వారు నొక్కి చెబుతున్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారి అత్యంత దీర్ఘకాలం 35 రోజుల పాటు ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. అయితే, ఈ మూసివేతకు ముగింపు పలుకుతూ తీసుకున్న నిర్ణయాన్ని సంప్రదాయవాదులు విమర్శిస్తున్న నేపథ్యంలో ట్రంప్ మాత్రం శనివారం తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్, ఇందుకు సంబంధించి ఎలాంటి నిధులు రాకుండానే ఆయన తిరిగి ప్రభుత్వాన్ని తెరవడంపై సంప్రదాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి నిష్పక్షపాతమయిన ఒప్పందం రాకుంటే ఫిబ్రవరి 15వ తేదీన ప్రభుత్వం తిరిగి మూతపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. లేదా అమెరికా దక్షిణ సరిహద్దులో తాను అభివర్ణించిన ‘మానవతా, భద్రతా సంక్షోభాన్ని’ పరిష్కరించడానికి తాను తన కార్యనిర్వాహక అధికారాలను వినియోగిస్తానని ట్రంప్ తెలిపారు.