అంతర్జాతీయం

ఆఫ్రికా దేశాలకు మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డీస్ అబాబా, ఫిబ్రవరి 9: ఆఫ్రికా దేశాల్లో కొన్ని చోట్ల నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, వివాదాల పరిష్కారానికి అవసరమైన వాతావరణం నెలకొని ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెర్రెస్ చెప్పారు. చాలా దేశాల్లో తిరుగుబాట్ల బాట పట్టిన నేతలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటున్నారన్నారు. ఇథియోఫియా రాజధాని ఆడ్డీస్ అబాబాలో ఆఫ్రికా యూనియన్ దేశాల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఆఫ్రికాలో అనేక సమస్యల పరిష్కారానికి మంచి రోజులు వచ్చాయనే ఆశాభావం లభిస్తోందన్నారు. శాంతి పవనాలు త్వరలో వీస్తాయన్నారు. ఇథియోఫియా, ఇరిట్రియా దేశాల మధ్య శాంతి ఒప్పందాలు ఖరారు కావడం మంచి పరిణామమన్నారు. మడగాస్కర్, డీఆర్‌సీ, మాలి తదితర దేశాల్లో ఎన్నికలు జరగడం శుభపరిణామమన్నారు. లిబియాలో ఆశాజనకమైన వాతావరణం నెలకొందన్నారు. ఇథియోఫియా, ఇరిట్రియా దేశాల మధ్య 20 ఏళ్లుగా అశాంతి, యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. మధ్య ఆఫ్రికా దేశాల్లో 14 గ్రూపులు సాయుధ పోరాటాల్లో ఉన్నాయన్నారు. 2012నుంచి జరిపిన మధ్యవర్తిత్వం జయప్రదమవుతోందన్నారు. ఈ సంఘర్షణల్లో పది లక్షల మంది నిర్వాసితులయ్యారని, కొన్ని లక్షల మంది మరణించారన్నారు. ఆఫ్రికా యూనియన్, ఐక్యరాజ్యసమితి చొరవ వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా ఆఫ్రికా దేశాలు నిలిచే రోజు త్వరలోనే వస్తుందన్నారు. యుద్ధం, సాయుధ తిరుగుబాట్లతో ప్రజలు అలసిపోయి ఉన్నారన్నారు. ప్రజలు అభివృద్ధి, శాంతిని కోరుకుంటున్నారన్నారు.