అంతర్జాతీయం

తెరపైకి మళ్లీ జాదవ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దహేగ్, ఫిబ్రవరి 16: కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడి వల్ల భారత్, పాకిస్తాన్‌ల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కుల్‌భూషణ్ సుధీర్ జాదవ్ కేసు సోమవారం ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు చెందిన ఉన్నత స్థాయి న్యాయస్థానంలో విచారణకు రాబోతోంది. భారత నావికాదళం మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్ సుధీర్ జాదవ్‌ను 2016 మార్చిలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో గూఢచర్యం నెరపినందుకు అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ పేర్కొంటోంది. తరువాత పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే, భారత్ పాకిస్తాన్ విధించిన ఈ శిక్షను హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేసింది. దీంతో జాదవ్‌కు విధించిన మరణ శిక్ష అమలును నిలిపివేయాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 2017లో పాకిస్తాన్‌కు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. తరువాత విచారణను పెండింగ్‌లో పెట్టింది. ఈ కేసు ఇప్పుడు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణకు రానుంది. అణ్వస్త్ర దేశాలయిన భారత్, పాకిస్తాన్‌లు ఈ కేసులో తమ వాదనలు వినిపించనున్నాయి. భారత న్యాయవాదులు సోమవారం తమ వాదనలు వినిపిస్తారు. తరువాత మంగళవారం పాకిస్తాన్ న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. భారత మాజీ నేవీ అధికారి అయిన జాదవ్ తమ దేశంలోని బలూచిస్తాన్‌లో భారతదేశ నిఘా ఏజెన్సీలను నడుపుతున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్ బలూచిస్తాలోని వేర్పాటువాదులకు మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తోంది.