అంతర్జాతీయం

నేనే చంపేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కాంగో (సౌత్ ఆఫ్రికా) మహిళ సింథియా హత్య కేసులో నిందితుడు రూపేష్‌కుమార్ కస్టడీ ముగిసింది. ఈనెల 4న సింథియాను ఆమె భర్త రూపేష్‌కుమార్ అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని శంషాబాద్ సమీపంలోని మదనపల్లిలో పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. కేసులో నిందితుడు రూపేష్‌కుమార్‌ను మూడురోజులపాటు విచారించిన మాదాపూర్ పోలీసులు నిందితుడి కస్టడీ వివరాలు శనివారం కోర్టుకు సమర్పించారు. తన భార్య సింథియాను తానే చంపేశానని రూపేష్‌కుమార్ అంగీకరించినట్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో తన భార్య ఫ్రాన్స్ యువకుడితో చాటింగ్ చేయడం సహించలేకపోయానని విచారణలో అంగీకరించినట్టు పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఫేస్‌బుక్ పరిచయం చివరకు ఫ్రాన్స్‌కు వెళ్లి వివాహం చేసుకునేంత వరకూ వెళ్లడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్టు వివరించాడు. కూతురు సానియా అంటే చాలా ఇష్టమని, అందుకే సింథియాను ముక్కలు ముక్కలు చేసినట్టు రూపేష్ అంగీకరించాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.