అంతర్జాతీయం

అభినందన్‌ను విడుదల చేయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 1: పాక్ ఆర్మీకి చిక్కిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయరాదంటూ ఒక పాకిస్తాన్ పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు డిస్మిస్ చేసింది. గత బుధవారం తన సరిహద్దుల్లో పాక్ ఆర్మీ భారత్ పైలెట్ అభినందన్‌ను పట్టుకున్న విషయం విదితమే. పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం అభినందన్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైలెట్ అభినందన్‌ను విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. గగనతల నిబంధనలను అతిక్రమించి పాక్‌లో చొరబడిన అభినందన్‌ను ఏ ప్రాతిపదికన విడుదల చేస్తారని ఆయన కోర్టును కోరారు. అభినందన్ అక్రమంగా చొరబడి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని పిటిషనర్ కోరారు. ఈ పైలెట్‌ను విచారించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అథర్ మిన్ హల్లా కొట్టివేశారు.