అంతర్జాతీయం

పాకిస్తాన్ మోడల్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 16: పాకిస్తాన్ మోడల్ ఖాందిల్ బాలోచ్ దారుణ హత్యకు గురైంది. ఆమె సోదరుడే పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్‌లో బాలోచ్‌ను హత్యచేశాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించేవారిని ఆమె తీవ్రంగా విమర్శించేది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టుచేస్తూ సంచలన మోడల్‌గా పేరుతెచ్చుకుంది. ఆమె వ్యవహారం నచ్చని సోదరుడు అనేకసార్లు మందలించినా వినిపించుకోలేదని, దీంతో సోదరిని తుపాకీతో కాల్చి చంపేశాడని పోలీసు అధికారి అజార్ అక్రం వెల్లడించారు. ఖాందిల్ బాలోచ్ అసలు పేరు ఫౌజియా అజీం. మోడల్‌గా మారిన తరువాత పేరు మార్చుకుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో అభ్యంతర పోస్టులు చేయడంతో కుటుంబ సభ్యులు అనేకసార్లు హెచ్చరించారు. మూడు వారాల క్రితమే తనకు రక్షణ కల్పించాలని ఆంతరంగిక మంత్రిని బాలోచ్ అభ్యర్థించింది. 26 ఏళ్ల మోడల్‌కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు చెప్పారు. క్రికెట్ దిగ్గజం, రాజకీయ నేత ఇమ్రాన్‌ఖాన్‌ను పెళ్లాడాలని ఉందని బాలోచ్ అనేక సార్లు ప్రకటించింది.

చిత్రం.. మోడల్ ఖాందిల్ బాలోచ్