అంతర్జాతీయం

ఉద్రిక్త పరిస్థితులపై చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 6: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు తమ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి కోంగ్ జుయానియోను పాకిస్తాన్‌కు పంపించినట్టు చైనా బుధవారం తెలిపింది. ‘అతను (కోంగ్) పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన భారత్, పాకిస్తాన్‌ల మధ్య పరిస్థితి గురించి పాకిస్తాన్‌తో మాట్లాడుతున్నారు’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి చేసింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అదే రోజు ప్రకటించింది.
ఈ ఆత్మాహుతి దాడి తరువాత ఫిబ్రవరి 26వ తేదీన భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్‌కు చెందిన అతిపెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరంపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ వైమానిక దాడిలో జైషే మహ్మద్‌కు చెందిన పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, ఆత్మాహుతి దళాల సభ్యులు హతమయ్యారు. మరుసటి రోజు పాకిస్తాన్ వాయుసేన (పీఏఎఫ్) భారత్‌పై ప్రతిదాడికి దిగింది. ఈ దాడిని భారత్ తిప్పికొట్టింది. ఇరు దేశాల వాయుసేనల మధ్య జరిగిన పోరులో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని భారత్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూల్చివేసింది. ఈ ప్రయత్నంలో మిగ్-21 కూడా కూలిపోయింది. పారాచ్యూట్ సహాయంతో దూకిన మిగ్-21 యుద్ధ విమానం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌లో పడిపోగా, అతడిని పాకిస్తాన్ ఆర్మీ బంధించింది. పాకిస్తాన్ శుక్రవారం అతడిని తిరిగి భారత్‌కు అప్పగించింది. ‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితిపై చర్చించడమే కోంగ్ పాకిస్తాన్ పర్యటన ఉద్దేశం. చైనా ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల కోసం కృషి చేస్తోంది. పాకిస్తాన్, భారత్‌లు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తాయని మేము విశ్వసిస్తున్నాం’ అని లుకాంగ్ అన్నారు.