అంతర్జాతీయం

ఐర్లాండ్‌వాసి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, మార్చి 6: ఐర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి మలేసియాలో దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం ఈ సంఘటనపై వార్తలు వెలువడ్డాయి. కత్తిపోట్లకు గురయి, కట్టివేయబడి ఉన్న బ్రియాన్ పాట్రిక్ ఓరియెల్లీ మృతదేహాన్ని సోమవారం ఉత్తర ద్వీపకల్పమయిన పెనాంగ్‌లోని జార్జ్ టౌన్‌లో కనుగొన్నారు. బ్రియాన్.. జార్జ్ టౌన్‌లో గత నెల రోజులుగా ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారని అధికార వార్తాసంస్థ బెర్నామా తెలిపింది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 40 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తిని, 30 ఏళ్ల వయసు గల ఒక మహిళను అరెస్టు చేశారు. ఈ హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో మరో విదేశీయుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని స్టార్ న్యూస్‌పేపర్ తెలిపింది.