అంతర్జాతీయం

చర్చి మతాధికారికి ఆరు నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లియాన్ (ఫ్రాన్స్), మార్చి 7: చిన్నపిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన లియాన్‌కు చెందిన ఆర్చిబిషప్, ఫ్రెంచి కేథలిక్ సీనియర్ మతగురువుకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. 2014-15 మధ్య ఒక మైనర్ పట్ల లైంగిక చర్యకు పాల్పడ్డాడన్న ఆరోపణపై కార్డినల్ ఫిలిప్పే బార్మేరియన్ అనే చర్చి మతగురువుకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. తీర్పు సమయంలో ఆయన కోర్టులో లేరు. కాగా, ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని ఆయన న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా లాయర్ జీన్-ఫెలిక్స్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ తీర్పుపై తాము పైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు 1980, 1990 కాలానికి సంబంధించినవని, అప్పటి ఆరోపణపై ఇప్పుడు విచారణ జరిపి శిక్ష వేయడం సమంజసం కాదని, దీనిని తాము పై కోర్టులో ప్రశ్నిస్తామని చెప్పారు. కాగా, ఈ తీర్పు పిల్లల రక్షణకు తాము చేస్తున్న పోరాటంలో విజయమని బాధితులకు బాసటగా నిలిచిన ఫ్రాన్సియోస్ డెవాక్స్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేథలిక్ చర్చిలోని సెక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తాము చర్చి మతాధికారుల వల్ల అనేక వేధింపులకు గురయ్యామంటూ పలువురు బయటకు వచ్చి వారి ఆగడాలను ప్రపంచానికి వెల్లడించడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సైతం వారు బయటపెడుతున్నారు. కాగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, చీలి, ఐర్లాండ్, అమెరికా తదితర దేశాలకు చెందిన కొందరు మతాధికారులపై సైతం ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోప్ స్పందిస్తూ ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుని చర్చిల పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.