అంతర్జాతీయం

ఉగ్రవాదుల పట్ల ఇక కఠిన వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 12: పాకిస్తాన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని, భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని ఆ దేశం అమెరికాకు హామీ ఇచ్చింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సోమవారం జరిపిన ఫోన్ సంభాషణలో ఈ హామీ ఇచ్చారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. అదే రోజు ఇక్కడ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియోతో భేటీ అయ్యారు. ‘పాకిస్తాన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా అర్థవంతమయిన చర్యలు తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషితో మాట్లాడాను’ అని బోల్టన్ తెలిపారు. ‘పాకిస్తాన్ అన్ని ఉగ్రవాద సంస్థలతో కఠినంగా వ్యవహరిస్తుందని, భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలను కొనసాగిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి నాకు హామీ ఇచ్చారు’ అని బోల్టన్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబుదాడికి పాల్పడి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.