అంతర్జాతీయం

వలసదారులపై విషం కక్కాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 15: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో గల రెండు మసీదుల్లో 49 మందిని కాల్చి చంపిన ఆస్ట్రేలియాకు చెందిన దుండగుడు బ్రెంటన్ టారెంట్ తన దుశ్చర్యను ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడు. ఈ వీడియోతో పాటు తాను ఆ చర్యకు ఎందుకు పాల్పడ్డాడో వివరిస్తూ ఒక మేనిఫెస్టోను కూడా పోస్ట్ చేశాడు. బ్రెంటన్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 1.40 గంటలకు మసీదుల్లో కాల్పులకు తెగబడ్డాడు. బ్రెంటన్ తన ట్విట్టర్ ఖాతాలో కాల్పులకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోల్లో తుపాకులు, మందుగుండు సామగ్రి మొదలగునవి ఉన్నాయి. ప్రాచీన యుద్ధాలు, ఇటీవల ముస్లింలపై జరిగిన దాడులతో పోలుస్తూ ఆయుధాల గురించి అతను రాశాడు. అల్ నూర్ మసీదులో ఒక మూలన అతను నడుస్తూ ఉండటం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో కనిపించింది. ముందు దర్వాజా ద్వారా మసీదులోకి ప్రవేశించిన అతను తరువాత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనేక గదుల్లోకి వెళ్లి ఒక సెమీ ఆటోమాటిక్ రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. బ్రెంటన్ కారులో పారిపోయేంత వరకు ఈ వీడియో చిత్రీకరించి ఉంది. తరువాత బ్రెంటన్ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను అధికారులు మూసివేశారు. తాను తెల్ల జాతీయుడినని పేర్కొన్న బ్రెంటన్ ఐరోపాయేతరులను ఐరోపా నుంచి పంపించివేయాలని డిమాండ్ చేశాడు. ఐరోపా ప్రజల ఆధిక్యత ఉండాలని కోరాడు. అల్పాదాయం ఉన్న కార్మికవర్గ కుటుంబంలో తాను జన్మించినట్టు 28 ఏళ్ల బ్రెంటన్ పేర్కొన్నాడు.