అంతర్జాతీయం

బొలీవియాకు వంద మిలియన్ డాలర్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుక్రె (బొలీవియా), మార్చి 30: భారత్ బొలీవియాకు వంద మిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా బొలీవియాకు వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరెల్స్‌తో జరిపిన విస్తృత స్థాయి చర్చల తరువాత భారత్ ఈ రుణం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. బొలీవియాతో భారత్ దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న తరువాత ఈ దేశంలో పర్యటించిన తొలి భారతదేశ ఉన్నత స్థాయి నేత రామ్‌నాథ్ కోవిందే. ఆర్థికం, అంతరిక్షం, ఐటీ వంటి అనేక ద్వైపాక్షిక అంశాలపై కోవింద్ బొలీవియా అధ్యక్షుడు మొరేల్స్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవడానికి తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ‘బొలీవియాలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడానికి గాను ఆ దేశానికి వంద మిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్త చేసింది’ అని ఇరు దేశాల నేతల చర్చల తరువాత ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. వర్తమాన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఆ ప్రకటన వెల్లడించింది. విద్య, అంతరిక్షం, వైద్యం సహా వివిధ రంగాలకు చెందిన ఎనిమిది ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అంతర్జాతీయ సౌర కూటమిలో బొలీవియా భాగస్వామి అయినందుకు తమకు సంతోషంగా ఉందని కోవింద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.