అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉదాసీనత వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 23: ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ పనిచేస్తున్న తీరు ఎంతమాత్రం వాస్తవికంగా లేదని భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కొన్ని దేశాల సంకుచిత ప్రాధాన్యతలకే ఈ ఆంక్షల కమిటీలు కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టమవుతోందని తెలిపింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తమ డిమాండ్‌ను చైనా అడ్డుకున్న నేపథ్యంలో ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ అభిషేక్ సింగ్ మాట్లాడారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న ప్రయత్నాలను బలోపేతం చేయయడంతోపాటు ఉగ్రవాద నిరోధక చర్యలను కూడా ఐరాస చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై నిస్సహన ధోరణి అవలంబిస్తామంటూ చేస్తున్న ప్రకటనలు అన్ని దేశాల ఉమ్మడి లక్ష్యానికి అద్దం పట్టేలా ఉండాలని అన్నారు.