అంతర్జాతీయం

చలో ఇండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 27: భారత్‌లో నెలకొన్న వ్యాపారానుకూలతకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటి వరకు చైనా నుంచే పనిచేస్తున్న 200లకు పైగా అమెరికా ఉత్పాదక కంపెనీలు చైనా నుంచి తమ కేంద్రాలను భారత్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కంపెనీలు భారత్‌కు తమ కేంద్రాలను మార్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ కీలక ఫోరం స్పష్టం చేసింది. అమెరికా - భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరం అధ్యక్షుడు ముఖేష్ ఆఘీ ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాకు ప్రత్యామ్నాయంగా వ్యాపారానుకూలత కలిగిన దేశాల కోసం అనే్వషిస్తున్న అమెరికా కంపెనీలకు భారతదేశం అన్ని విధాలుగా లబ్ది చేకూర్చే దేశంగా మారిందని ఆయన తెలిపారు. భారతదేశంలో పెట్టుబడి పెట్టడం ద్వారా చైనా ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఈ కంపెనీల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని ఆఘీ వెల్లడించారు. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అన్ని విధాలుగా సంస్కరణలను వేగవంతం చేయాలని, అలాగే విధాన నిర్ణాయక ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించాలనే తాము కోరుతున్నామన్నారు. అమెరికాకు చెందిన కంపెనీలు ఇతర దేశాల నుంచి భారత్‌కు తమ కేంద్రాలను మళ్లించాలంటే ఇదెంతో కీలకమని గత 12 నుంచి 18 నెలలుగా అనేక అమెరికా కంపెనీలు ఇదే అంశంపై దృష్టిపెట్టాయని ఆయన అన్నారు. కొత్తగా పెట్టుబడులను ఆకర్షించాలంటే భారత్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వ ఆలోచనలు, అజెండా ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆయన మాట్లాడారు. వ్యాపార పరమైన పారదర్శకతతో పాటు సంప్రదింపుల ప్రక్రియకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటి ప్రాతి పదికగానే అమెరికా కంపెనీలను ఏ విధంగా ఆకర్షించవచ్చునన్న దానిపై దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా స్థల కేటాయింపుల నుంచి కష్టం సుఖాల వరకు అన్నింటిలోనూ సంస్కరణలతో పాటు పారదర్శకత కూడా బలంగా నెలకొనాలన్నారు. దీనివల్ల కొత్త కంపెనీలు అలాగే పెట్టుబడులు రావడమే గాకుండా, ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేందుకు వీలుంటుంది అని అన్నారు. భారత్ - అమెరికాల మధ్య స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరుదేశాల మధ్య వ్యాపార వాణిజ్యపరపైన సానుకూలత కూడా ఇనుమడిస్తుందన్నారు. చైనా నుంచి చౌకబారు వస్తువులు దిగుమతి కావడానికి కూడా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా నిరోధించే అవకాశం ఉంటుందని తెలిపారు.