అంతర్జాతీయం

మాతో పెట్టుకోకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 25: భారత్‌లో ఉంటున్న ముగ్గురు తమ పౌరులకు వీసా పొడిగింపును తిరస్కరించటంపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్ తమపై ప్రతీకారం తీర్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది. ఢిల్లీలో ఒక బ్యూరో చీఫ్, ముంబైలోని ఇద్దరు జర్నలిస్టులకు వీసా పొడిగింపును తిరస్కరించటంపై గ్లోబల్‌టైమ్స్ సోమవారం సంపాదకీయం రాసింది. అణు ఇంధన సరఫరా గ్రూప్‌లో భారత్ సభ్యత్వాన్ని అడ్డుకున్నందుకు ప్రతీకారంగా, తమ ముగ్గురు జర్నలిస్టులకు వీసా తిరస్కరించారని ఆరోపించింది. జర్నలిస్టుల వీసా తిరస్కరణకు చెప్తున్న అనధికార కారణాలు పేలవమైనవని కూడా విమర్శించింది. వీసా పొడిగింపును ఆపడానికి అధికారిక కారణాలు ఏవీ చెప్పలేదని కూడా పేర్కొంది. ‘ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వాన్ని వ్యతిరేకించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని న్యూఢిల్లీ భావిస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించింది. భారత మీడియా మాత్రం ఈ ముగ్గురు జర్నలిస్టులు మారు పేర్లతో వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని విమర్శించింది. దీనిపై గ్లోబల్‌టైమ్స్ స్పందిస్తూ ‘్భరత్‌ది అనుమానపు బుద్ధి. ఈసారి మన ప్రతిస్పందన ఏమిటో కార్యాచరణలో భారత్‌కు చూపాలి. కనీసం కొందరు భారతీయులైనా చైనా వీసా రావటం చాలా కష్టమని భావించాలి’ అని వ్యాఖ్యానించింది.