అంతర్జాతీయం

చిన్నారి చికిత్సకు 8రోజుల్లో విరాళంగా 6లక్షల డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 7: అది ఒక హృదయవిదారకమైన ఘటన. గత నెల 23న వాషింగ్టన్‌లోని సన్నివలెలో రోడ్డు దాటుతున్న ఒక కుటుంబాన్ని మానసిక స్థితి బాగా లేని ఒక మాజీ జవాన్ ట్రక్‌తో ఢీ కొట్టారు. దీంతో 13 ఏళ్ళ చిన్నారి ధీర్తి నారాయణ్, ఆ చిన్నారి తండ్రి, సోదరుడు, మరో ఏడు మంది గాయపడ్డారు. అయితే వీరిలో ధీర్తి నారాయణ్ పరిస్థితి విషమంగా ఉంది. ధీర్తి నారాయణ్ చికిత్సకు అయ్యే ఖర్చులో తమ వంతు సహాయం అందించేందుకు అమెరికన్లు ముందుకు వచ్చారు. 8 రోజులు విరాళాలు సేకరించగా, 8 లక్షల డాలర్లు సమకూరాయి. 12,500 మంది విరాళాలు అందజేశారు. ఆ చిన్నారికి చికిత్స అందుతున్నది. రోడ్డు దాటుతున్న వారు ముస్లింలుగా భావించి ప్రమాదం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ మాజీ జవాన్ మానసిక పరిస్థితి బాగా లేదని వారు చెప్పారు.