అంతర్జాతీయం

ఇంకా లంకకు ఐసిస్ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 7: దేశ సైన్యం, పోలీసులు సమయస్పూర్తిగా, వీరోచితంగా ఉగ్రవాదులను మట్టుపెట్టారని శ్రీ లంక ప్రధాన మంత్రి రాణెల్ విక్రమాసింఘే తెలిపారు. అయినా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశ భద్రతపై మంగళవారం పార్లమెంటులో జరిగిన చర్చకు ప్రధాని విక్రమాసింఘే సమాధానమిస్తూ గత నెలలో ఈస్టర్ సండే సందర్భంగా మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళలో ఉగ్రవాదులు బాంబులు పేల్చిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనల్లో 253 మంది మృత్యువాత పడ్డారని, మరో 500 మంది గాయపడ్డారని ఆయన ఆవేదన చెందారు. ఈ దాడులు తామే చేశామంటూ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రమాదం పూర్తిగా సమిసిపోలేదని, ప్రపంచంలో మనం ఇప్పుడు ఉగ్రవాదుల బాధితులం..’ అని ఆయన అన్నారు. పోలీసులు, సైన్యం కృషి ఫలితంగా దేశంలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

చిత్రం... ప్రధాని విక్రమ సింఘే