అంతర్జాతీయం

శరీర కదలికలను నియంత్రించే స్మార్ట్ దుస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో, మే 17: సహజంగా పరిస్థితులను బట్టి శరీర కదలికలు ఉంటాయి. కొందరు కోపం వచ్చినపుడు ఆగ్రహంతో ఊగిపోవడం, భయపడినపుడు వణకడం వంటి సహజ ప్రక్రియలు మనిషి శరీరంలో చోటుచేసుకుని ఉన్నాయి. తీవ్రమైన కోపం, భయం కారణంగా ఒక్కోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. రక్త ప్రసరణ తీవ్రమై మనిషి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చు. అయితే, ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా (యూబీసీ/కెనడా) శాస్తవ్రేత్తలు అంటున్నారు. శరీర కదలికలను పసిగట్టి, ఎప్పటికప్పుడు మెదడుకు తగిన సూచనలు ఇచ్చి, నియంత్రించే స్మార్ దుస్తులను తయారు చేస్తున్నట్టు ఈ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మీనా హూర్ఫార్ తెలిపారు. నానో పేట్రేట్స్, మైక్రోస్కోపిక్ సెన్సార్లతో తయారయ్యే సరికొత్త దుస్తులతో మానవ శరీర కదలికలను నియంత్రీకరించే అవకాశం ఉంటుందని, సమస్యల నుంచి బయటపడవచ్చునని పేర్కొన్నారు.