అంతర్జాతీయం

ఆలోచనలతో రోబోల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన ఒక శాస్తజ్ఞ్రుడు ఆలోచనలతో రోబోలను నియంత్రించే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఒక సంస్థ కోసం ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి 20 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకున్నారు. తన బృందంతో కలిసి ఆయన ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ఒక సైనికుడు ఈ వ్యవస్థ ద్వారా తన ఆలోచనలతో బహుళ సంఖ్యలో ఉన్న మానవరహిత గగనతల వాహనాలను, బాంబ్ డిస్పోజల్ రోబోను కూడా నియంత్రించగలరు. బటెల్లెలో సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న గౌరవ్ శర్మ నేతృత్వంలోని ఒక టీమ్ సహా మొత్తం ఆరు బృందాలు బ్రెయిన్- మెషిన్ ఇంటర్‌ఫేస్‌లను అభివృద్ధి చేయడానికి నిధులు పొందాయి. అమెరికాలోని డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డీఏఆర్‌పీఏ) ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఒక సైనికుడు తలకు ఒక హెల్మెట్ ధరించి తన మనసుతో బహుళ సంఖ్యలో ఉన్న మానవరహిత గగనతల వాహనాలను, బాంబ్ డిస్పోజల్ రోబోను కూడా నియంత్రించగలిగే ఒక వ్యవస్థను అభివృద్ధి చేసే బాధ్యతను 40 ఏళ్ల శర్మకు అప్పగించడం జరిగింది అని కొలంబస్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సంస్థ బటెల్లె ఒక ప్రకటనలో వివరించింది. మినిమల్లీ ఇన్‌వాసివ్ న్యూరల్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ కోసం ఉద్దేశించిన నెక్స్ట్-జనరేషన్ నాన్‌సర్జికల్ న్యూరోటెక్నాలజి (ఎన్3) కార్యక్రమానికి ‘బ్రెయిన్‌స్టార్మ్స్’ (బ్రెయిన్ సిస్టమ్ టు ట్రాన్స్‌మిట్ ఆర్ రిసీవ్ మాగ్నెటోఎలక్ట్రిక్ సిగ్నల్స్) అని పేరు పెట్టడం జరిగింది. బ్రెయిన్‌స్టార్మ్స్‌తో ఒక నావెల్ నానోట్రాన్స్‌డ్యూసర్‌ను అభివృద్ధి చేస్తారు. ట్రాన్స్‌డ్యూసర్‌ను తాత్కాలికంగా ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి ప్రవేశపెడతారు. ఒక హెల్మెట్ ఆధారిత ట్రాన్స్‌సీవర్‌తో కమ్యూనికేషన్ ద్వారా ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడానికి దోహదపడేలా మెదడులోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి నిర్దేశిస్తారని ఆ ప్రకటన వివరించింది. ‘ఇది నేను పనిచేసిన అత్యంత ఉత్తేజకరమయిన, సవాలుతో కూడిన ప్రాజెక్టుల్లో ఒకటి’ అని శర్మ పేర్కొన్నారు. ‘బ్రెయిన్‌స్టార్మ్స్‌తో మేము మరోసారి ఇంజినీరింగ్, ఫిజిక్స్ పరిధులను విస్తరించగలం. ఇది విజయవంతమయితే, మానవుడికి, మెషిన్‌కు మధ్య సురక్షితమయిన, సమర్థవంతమయిన అనుసంధానానికి వీలు కల్పించడమే కాకుండా నాడీ వ్యవస్థ అధ్యయనంలో విప్లవం తీసుకొచ్చే శక్తి ఈ టెక్నాలజీకి ఉంటుంది’ అని శర్మ పేర్కొన్నారు. బటెల్లె 2మిలియన్ డాలర్ల నిధులతో ఈ ప్రోగ్రాం తొలి దశను ప్రారంభించింది. ఈ దశలో టెక్నాలజి కీలక కానె్సప్ట్‌ను ప్రదర్శిస్తుంది. టీమ్స్ కానె్సప్ట్ విజయవంతమయితే, బటెల్లె రెండో, మూడో దశల కోసం నిధులను అందుకుంటుందని ఆ ప్రకటన తెలిపింది. నాలుగేళ్లకు పైగా కాలం పాటు సాగే ఈ కాంట్రాక్టు మొత్తం విలువ సుమారు 20 మిలియన్ డాలర్లని వివరించింది.