అంతర్జాతీయం

అనుమానాస్పద స్థితిలో హిందూ వైద్యుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 30: పాకిస్తాన్‌లో అనిల్ కుమార్ (32) అనే హిందూ వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరాచీలోని ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఐసియులోని సర్జికల్ విభాగంలో పనిచేస్తున్న అనిల్ కుమార్ శనివారం తెల్లవారు జామున 5.30 గంటలకు లోపలికి వెళ్లాడని, మూడు గంటల తర్వాత అతను శవమై కనిపించాడని ఈద్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. గది తలుపు తడితే అనిల్ కుమార్ నుంచి సమాధానం రాలేదని, దీంతో తలుపు బద్దలు కొట్టగా లోపల కుర్చీలో అనిల్ కుమార్ మృతదేహం కనిపించిందని, అక్కడ ఒక సిరంజి కూడా ఉందని తెలిపారు. అనిల్ కుమార్ చేతికి ఇంజెక్షన్ చేసుకున్నట్లు కనిపిస్తోందని, దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నామని నరుూముద్దీన్ చెప్పారు.