అంతర్జాతీయం

కసాయి సవతి తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 4: అభం-శుభం తెలియని ఓ తొమ్మిదేళ్ళ చిన్నారి గొంతు నులిమి చంపేసిన ఓ భారతీయ మహిళకు అమెరికా కోర్టు 22 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించింది. బాత్‌రూంలోని బాత్ టబ్‌లో ఆ మహిళ సవతి బిడ్డ గొంతు నులిమి హత్య చేసిన నేరాన్ని తాము ఊహించలేకపోతున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. అత్యంత హృదయవిదారకరమైన ఈ ఘటనతో చలించిన న్యాయమూర్తి ఆ కిరాతక సవతి తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. న్యూయార్క్‌లోని క్విన్స్ ప్రాంతంలో 2016 సంవత్సరం ఆగస్టులో షందాయి అర్జున్ (55) తన సవతి బిడ్డను గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ చిన్నారి అష్‌దీప్ కౌర్‌ను బాత్ రూం టబ్‌లో గొంతు నులిమి హత్య చేశారు. 2016 సంవత్సరం ఆగస్టు 19న సాయంత్రం క్విన్స్ అపార్టుమెంటులో తన మాజీ భర్త రేమండ్ నారాయణ, ఇద్దరు మనవళ్ళు బయటకు వెళ్ళడాన్ని అపార్టుమెంటులో ఒక సాక్షి గమనించారు. అయితే తొమ్మిదేళ్ళ చిన్నారి ఎక్కడ అని సాక్షి ప్రశ్నించగా, బాత్‌రూంలో ఉందని, తండ్రి సుఖీందర్ సింగ్ వచ్చి తీసుకెళతానని చెప్పారని దాట వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు సోమవారం ఆ కసాయి తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.