అంతర్జాతీయం

వీధుల్లోకి స్విట్జర్లాండ్ మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, జూన్ 14: వేతనాల విషయంలో లింగ వివక్షను నిరసిస్తూ స్విట్జర్లాండ్ మహిళాలోకం కదం తొక్కింది. ఈ వివక్షను ఇంకెంత మాత్రం సహించబోమంటూ గొంతెత్తి నినదించింది. స్విట్జర్లాండ్ దేశవ్యాప్తంగా మహిళలు శుక్రవారం సమాన వేతనాల కోసం సమ్మెకు దిగారు. ధనిక దేశమయిన స్విట్జర్లాండ్‌లో కొనసాగుతున్న లింగ వివక్షను, వేతన వ్యత్యాసాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి వచ్చారు. ‘నేను రాజీపడని మహిళలను ప్రేమిస్తాను’, ‘పితృస్వామ్యాన్ని నిర్మూలించాలి’ అని రాసి ఉన్న పోస్టర్లు, బ్యానర్లను మహిళలు చేతబూనారు. స్విట్జర్లాండ్‌లో దేశ వ్యాప్తంగా మహిళలు సమాన వేతనాల కోసం తొలిసారి దేశవ్యాప్త సమ్మె చేసిన సుమారు మూడు దశాబ్దాల తరువాత ఈ ఆందోళనకు దిగారు. అనేక నగరాలలో శుక్రవారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఊదారంగు గల దుస్తులు ధరించిన వేలాది మంది మహిళలు బెర్న్‌లో ప్రభుత్వ, పార్లమెంటు భవనాల ముందు గల కూడళ్లకు చేరుకున్నారు. 68 ఏళ్ల మను బొండి తన కుమార్తె, మనుమరాలితో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. 1991లో నిర్వహించిన ప్రదర్శనలో ఆమెతో కలిసి పాల్గొన్న ఇద్దరు స్నేహితులు కూడా మళ్లీ ఆమెతో కలిసి శుక్రవారం నాటి ఆందోళనలో పాల్గొన్నారు. అన్ని వయసులకు చెందిన అందరు మహిళలతో కలిసి ఆందోళనలో పాల్గొంటున్నట్టు మను తెలిపారు. ‘1991 నాటి ప్రదర్శనలో కన్నా ఈసారి మేము చాలా ఎక్కువ మందిమి పాల్గొన్నాం. ఈసారి మా డిమాండ్లు కూడా వేరు’ అని ఆమె తెలిపారు. ‘నాడు మేము అబార్షన్ గురించి ఆందోళన చేశాం. ఇప్పుడు అన్నింటికన్నా మించి సమాన వేతనాల కోసం ఆందోళన చేస్తున్నాం’ అని ఆమె వివరించారు. ప్రదర్శనలే కాకుండా మహిళలు వివిధ చోట్ల వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. లౌసనె్నలో ముందు రోజు రాత్రి నుంచే మహిళలు కార్యక్రమాలను ప్రారంభించారు. రాత్రి కేథెడ్రల్ గంటలను మోగించారు. తెల్లవారగానే సుమారు 500 మంది మహిళలు పట్టణంలోని ప్రధాన వంతెనపై సామూహిక అల్పాహారం చేశారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జెనీవాలో ఆందోళనకారులు పురుషుల పేర్లతో ఉన్న వీధుల చిహ్నాలను తొలగించి, మహిళల పేర్లతో ఏర్పాటు చేశారు.