అంతర్జాతీయం

ఆ అతివ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: చంద్రుడిపై అడుగు పెట్టేందుకు అమెరికా మరోసారి సన్నద్ధమవుతోంది. 2024 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ సారి చంద్రున్ని అందుకునే అవకాశాన్ని మహిళే దక్కించుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ మహిళ ఎవరు?. పోటీలో ఉన్న అనేక మంది అతివల్లో చంద్రున్ని అధిరోహించే అవకాశం ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఉత్కంఠ రేకిత్తిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చంద్రున్ని మరోసారి అందుకునే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించడమే కాకుండా ఈ అవకాశాన్ని ఓ మహిళకే అందించాలని తాపత్రయపడుతోంది. ఈ మహిళ ఎవరు అన్న దానిపై ప్రస్తుతం ఎవరికి సంకేతాలు లేవు. అయితే మొత్తం 12 మంది అమెరికా మహిళా వ్యోమగాముల్లో ఎవరో ఒకరికి చంద్ర మండలానికి వెళ్ళే అవకాశం దక్కుతుందనేది స్పష్టం. వీరి వయస్సు కూడా 40 నుంచి 53 సంవత్సరాల మధ్యే ఉంటుందని, అలాగే వీరందరూ గతంలో సైనిక పైలట్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా పని చేసిన వారేనని స్పష్టమవుతున్నది. నిజానికి 1990 ద్వితీయార్థం నుంచి చంద్రుడిపై అడుగు పెట్టడానికి సంబంధించిన ప్రాజెక్టులో పాల్గొనడానికి నాసాకు వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. ఎంతో మంది ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని చరిత్రలో నిలిచి పోవాలన్న ఆసక్తిని కనబరిచారు. నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్ తర్వాత చరిత్రలో నిలిచిపోయే ఈ అవకాశాన్ని ఎవరు దక్కించుకున్నా ఆ అతివ కీర్తి ప్రతిష్టలు అనన్యమే అవుతాయి. ఇప్పటికే గడువు తక్కువగా ఉంది కాబట్టి చంద్రయానానికి సంబంధించి తాజాగా దరఖాస్తులను నాసా ఆహ్వానించే అవకాశం లేదు. అయితే కొత్త వారికి అవకాశం ఇచ్చే కంటే కూడా రోదసీ వాతావరణానికి అలవాటు పడిన వారికి మాత్రమే దీనిని పరిమితం చేయాలని నాసా భావిస్తున్నది. చాలా మందికి ఉత్సాహం ఉన్నా అక్కడి వాతావరణం కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం ఒక్కసారి ఈ వ్యోమ యాత్రలో పాల్గొన్న వారికే ప్రాధాన్యతనివ్వడం మంచిదన్న అభిప్రాయాన్ని నాసా సీనియర్ అధికారి ఒకరు వ్యక్తం చేశారు.
1969 నుంచి 1972 మధ్య కాలంలో మొత్తం 12 మంది అమెరికా వ్యోమగాములు (పురుషులే) చంద్రుడిపై అడుగులు వేశారు. అయితే 1983లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అమెరికా మహిళగా సాలేరాయిడ్ గణతికి ఎక్కారు. 2013లో నియమించిన 21 మంది మహిళా వ్యోమగాముల్లో ఇటు ఉత్సాహం, అటు అనుభవం కూడా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇప్పటి నుంచి 2020లోగా వీరి తొలిసారి రోదసీలోకి వెళ్ళే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. 2017 మహిళా వ్యోమగాముల బ్యాచ్‌లో మరో ఐదుగురు మహిళలు ఉన్నారు. అయితే వీరంతా కూడా ఇందుకు సంబంధించి ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకోవాల్సి ఉంది. వీరికి అవకాశం రాదని చెప్పలేం కానీ చంద్రుడిపై మహిళ అడుగుపెట్టే గడువు తక్కువగా ఉంది కాబట్టి పరిస్థితి వీరికి అనుకూలంగా లేపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్ వారసత్వాన్ని అమెరికాకు చెందిన ఏ మహిళా వ్యోమగామి అందిపుచ్చుకుంటుందోనన్న ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

చిత్రం... వీరిలో చంద్రునిపై కాలు మోపే వ్యోమగామి ఎవరో?