అంతర్జాతీయం

కులాంతర వివాహాల వైపు భారతీయుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 16: భారతీయులు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు కులాంతర వివాహాల వైపు మళ్లుతున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వివాహ సంబంధాలు కుదిర్చే వెబ్‌సైట్ల (మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు) లోని డాటాను విశే్లషించిన పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. మాట్రిమోనియల్ వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్న అమెరికాలోని భారతీయ సంతతి ప్రజలు మాత్రం భారత్‌లో నివసిస్తున్న ప్రజలతో పోలిస్తే కులాంతర వివాహాల పట్ల తక్కువ ఆసక్తి చూపుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఆయా ప్రాంతాల్లో తాము మైనారిటీలుగా ఉండటం వల్ల, తమ సాంస్కృతిక పరమయిన గుర్తింపును కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని ఇది సూచిస్తోంది. అమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ మిచిగాన్‌కు చెందిన పరిశోధకులు భారత్‌లోని ప్రధాన మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలోని 3,13,000 మంది ప్రొఫైల్‌లలోని డాటాను ఉపయోగించుకొని ఈ అధ్యయనం చేశారు.
వెబ్‌సైట్‌లోని ఫారంలో ప్రజలు పూరించిన సమాచారంలో కులాంతర వివాహానికి మీరు సిద్ధమేనా? అనే ప్రశ్న ఒకటి నేరుగా ఉంది. ‘ప్రభుత్వం, సామాజిక సంస్థలు ఎంతో కృషి చేసినప్పటికీ, ప్రజల జీవితాల్లో కులం ఒక ముఖ్యమయిన భాగంగానే కొనసాగుతోంది’ అని యూనివర్శిటి ఆఫ్ మిచిగాన్‌కు చెందిన అశ్విన్ రాజదేసింగన్ పేర్కొన్నారు. ‘వివాహం చేసుకోవాలని కోరుకుంటున్న వారే మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తమ ప్రొఫైల్‌లు ఉంచారు. అందువల్ల వారి సమాధానాలు నిజాయితీతో కూడుకొని ఉంటాయి’ అని రాజదేసింగన్ పేర్కొన్నారు.