అంతర్జాతీయం

ద్వైపాక్షికం.. వ్యూహాత్మక భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 29: జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఖరి రోజు ప్రపంచ దేశాధినేతలతో బిజీబిజీగా గడిపారు. ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాధినేతలతో వాణిజ్య, ఉగ్రవాదం, రక్షణ, తీర ప్రాంత భద్రతపై మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. జీ-20 దేశాల రెండు రోజులు శిఖరాగ్ర సమావేశాల నిమిత్తం భారత ప్రధాని ఇక్కడకు వచ్చారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడొతో పలు కీలక అంశాలపై మోదీ చర్చించారు. పెట్టుబడులు, ద్వైపాక్షిక సహకారంపై ఇరుదేశాధినేతలు చర్చించినట్టు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. మోదీ, విడొడొ ఉన్నతస్థాయి సమావేశానికి సంబంధించి పీఎంవో ట్వీట్ చేసింది. ‘్భరత్-ఇండోనేసియా మధ్య సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుహృద్భావ వాతావణంలో చర్చజరిగింది. మోదీ పర్యటన ఫలప్రదమైంది’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి రవీష్‌కుమార్ స్పష్టం చేశారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, సముద్ర వాణిజ్యం, అంతరిక్షం అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడితో సమావేశం పూర్తయిన వెంటనే బ్రెజిట్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారోతో పలు ద్వైపాక్షిక అంశాలపై మోదీ విస్తృత చర్చలు జరిపారు. పెట్టుబడులు, వ్యవసాయం, బయో ఇంధన రంగానికి సంబంధించి బ్రెజిల్ అధినేతతో ప్రధాని చర్చలు సాగించినట్టు రవీష్‌కుమార్ వెల్లడించారు. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని బయో ఇంధన అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు కుమార్ ట్వీట్ చేశారు. తరువాత టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిపీ ఎర్డొగాన్‌తో పలు కీలక అంశాలపై మోదీ చర్చించారు. పెట్టుబడులు, రక్షణ రంగం, వాణిజ్యం, ఉగ్రవాదంపై మోదీ ప్రధానంగా దృష్టి సారించారు. అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని టర్కీ-్భరత్ నిర్ణయించాయి. ఐటీ రంగం, పౌర విమానయాన రంగంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. టర్కీ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశం
మంచి ఫలితాలను ఇచ్చిందని పీఎంఓ అభివర్ణించింది. ఇక ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో జరిగిన చర్చలపై భారత్ సంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడలు, మైనింగ్ టెక్నాలజీ, రక్షణ, తీర ప్రాంత భద్రత, ఇండో-పసిఫిక్ అంశాలపై ఆస్ట్రేలియా, భారత్ దేశాధినేతలు విస్తృతంగా చర్చించారు. అలాగే సింగపూర్ ప్రధాని లీ హైసిన్ లూంగ్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరాతో పలు ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. జీ- 20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రపంచ దేశాధినేతలతో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జింపింగ్‌తో పలు అంశాలపై చర్చించారు. తన అభిప్రాయాలను వెల్లడించేందుకు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు జీ-20 సమావేశాలను భారత్ చక్కగా సద్వినియోగం చేసుకుంది. జపాన్, అమెరికా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, జర్మనీ, ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా దేశాధినేతలతో మోదీ తొమ్మిది ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు.

చిత్రం...జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన వివిధ దేశాల అధినేతలు