అంతర్జాతీయం

ఉత్తర కొరియా గడ్డపై ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్మూన్‌జోమ్ (దక్షిణ కొరియా), జూన్ 30: ఉత్తర కొరియా గడ్డపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారంనాడు తొలిసారిగా అడుగుపెట్టారు. ఉత్తర కొరియా భూభాగంపై ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షుడు ఎవరూ కాలుమోపలేదు. అయితే, ఈ ఘనత సాధించిన అగ్రరాజ్యం అధినేతగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన పియాన్‌గ్యాంగ్స్ నాయకుడు కిమ్ జాంగ్ ఉన్‌తో దక్షిణ-ఉత్తర కొరియా సరిహద్దులోని ఓ నిస్సైనిక ప్రాంతం (డీఎంజెడ్)లో భేటీ అయి పలు దౌత్యపరమైన అంశాలపై కాసేపు ముచ్చటించారు. అనంతరం ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో కలసి ముందుగా చేసుకున్న అంగీకారం మేరకు అణ్వాయుధాల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ దక్షిణ కొరియా యువ నేతను తమ దేశ వైట్ హౌస్ సందర్శనకు రావాలని ‘ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రావచ్చు’ అంటూ ఆహ్వానించారు. ‘ప్రపంచానికే ఈరోజు చాలా గొప్ప దినం. తొలిసారి ఈ భూభాగంపై అడుగుపెట్టిన నాకు ఇక్కడ అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘చాలా గొప్ప విషయాలు జరుగుతున్నాయి’. ‘మా ఇద్దరి భేటీలో చర్చలు శాంతియుతంగా జరిగాయి’ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తెలిపారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలను సందర్శించాలన్న అభిలాషను శనివారంనాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. గత ఏడాది దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సింగపూర్‌లో జరిగిన ఒక సమావేశం సందర్భంగా భేటీ అయ్యాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఇరు దేశాలు చర్చించుకున్నప్పటికీ చర్చలు ఫలప్రదం కాలేదు. ఆ తర్వాత ఉభయ దేశాల నాయకులు ట్విట్టర్ వేదిగా ఎన్నోసార్లు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగారు. అయితే, జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఉత్తర, దక్షిణ కొరియాల నేతలతో కరచాలనానికి ముందుకు రావడం శుభారంభంగా ఆ దేశాలు అభివర్ణిస్తున్నాయి. ‘అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా భూభాగంపై పాదం మోపడం చరిత్రాత్మకం. ట్రంప్‌తో ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షులు భేటీ కావడంతో ఈ మూడు దేశాలు భవిష్యత్తులో పలు అంశాలపై జరిపే చర్చల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పలువురు విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర, దక్షిణ కొరియా నేతలను కలుసుకుని వారితో కరచాలనం చేయాలన్న అభిలాష చాలా గొప్పది. ట్రంప్ కోరిక ఆ మూడు దేశాల మధ్య పలు రకాల చర్చలు, సంప్రదింపులకు దారితీస్తుంది’ అని స్టిమ్సన్ సెంటర్ ఆసియా విశే్లషకుడు డేవిడ్ కిమ్ పేర్కొన్నారు.

చిత్రం...దక్షిణ కొరియా సరిహద్దులోని ఓ నిస్సైనిక ప్రాంతంలో ఆదివారం పర్యటించిన సందర్భంగా ఆ దేశ
అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.