అంతర్జాతీయం

రాజీనామా చేసి, ఇంటికెళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 8: ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, ఇంటికి వెళ్ళిపో..’ అని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి మండి బహద్దీన్‌లో జరిగిన ఊరేగింపులో పాక్ ముస్లిం-లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలైన 45 ఏళ్ళ మర్యం నవాజ్ తీవ్ర స్వరంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై మండిపడ్డారు. 66 ఏళ్ళ క్రికెటర్ రాజకీయ నాయకునిగా మారారని, ఖాన్‌కు పాక్‌ను పాలించే చట్టబద్ధమైన హక్కు లేదని అన్నారు. కాబట్టి ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, నేరుగా ఇంటికెళ్ళిపో..అని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న 69 ఏళ్ళ తన తండ్రిని కారాగారంలో ఉంచడం నేరం అని ఆమె దుయ్యబట్టారు. జైలులో పెట్టడం వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉందని ఆమె ధ్వజమెత్తారు. కానీ నవాజ్ షరీఫ్ జైలు నుంచి విడుదల అవుతారని, మళ్లీ ప్రధానిగా ఎన్నికై, దేశ ప్రజలకు విశిష్ట సేవలందిస్తారని ఆమె తెలిపారు. అనంతరం మర్యం నవాజ్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం న్యాయ వ్యవస్థ ప్రభుత్వంతో రాజీ పడిందని విమర్శించారు. అల్-అజీజీయా స్టీల్ మిల్స్ అవినీతి కేసులో షరీఫ్ గత ఏడేళ్ళుగా కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వం కుట్రతో షరీఫ్‌ను జైలు పెట్టిందని ఆమె ఆరోపించారు.