అంతర్జాతీయం

నేపాల్‌లో లోయలోపడ్డ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఆగస్టు 15: నేపాల్‌లో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్య నేపాల్‌లోని కవ్రేలో బిర్టా-డెయిరల్ హైవే నుంచి 300 మీటర్ల లోయలోకి ప్రయాణికుల బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 85 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని విచారణ అధికారి ధన్ బహదూర్ తెలిపారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందన్నారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్‌లో క్షతగాత్రులను ఖాట్మండు ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంలో ప్రధాని ప్రంచడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.