అంతర్జాతీయం

ఎఫ్‌డీఐ పరిమితుల్లో మార్పు ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 16: భారత్‌లోని మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు మారే పరిస్థితి లేదని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ విధానాన్ని రూపొందించడం జరిగిందని భారత్ వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పియూష్ గోయల్ మంగళవారం నాడిక్కడ వెల్లడించారు. యునైటెడ్ కింగ్‌డమ్ అంతర్జాతీయ వాణిజ్య విభాగం నిర్వహించిన ఇండియా-డే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన 49 శాతం ఎఫ్‌డిఐ నిబంధనను అన్ని విదేశీ సంస్థలు త్రికరణ శుద్ధిగా ఆచరించి తీరాలని అన్నారు. ప్రస్తుతానికి మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థలు విదేశీ పెట్టుబడులపై 49 శాతం పరిమితిని విధించిన విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. భారత దేశంలో చిల్లర వర్తక సంస్థలకు వందలాది సంవత్సరాల మనుగడ ఉందని, దేశం నలుమూలలకు ఇది విస్తరించిందన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకుని మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులు విధించామన్నారు. ఇప్పటికిప్పుడు ఈ నియమ, నిబంధనల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఈ వాస్తవాన్ని గుర్తించి ఎఫ్‌డిఐ నిబంధనలను పాటించాలన్నారు.
అయితే భారత దేశంలో సింగిల్ బ్రాండ్ విదేశీ కంపెనీలు రావడానికి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఎన్నో రాయితీలను అందిస్తున్నామని, అలాగే వ్యాపారపరంగా సరళీకృత విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. ఈ విషయంలో వారి డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. భారత్-యూకే ఆర్థిక, వాణిజ్య కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటనార్థం గోయల్ ఇక్కడికి వచ్చారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అవసరాల విస్తరణ, ఇతర అంశాలపై వారు చర్చిస్తారు.