అంతర్జాతీయం

అయోమయం.. భయానకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, జూలై 25: చైనా యుద్ధ ట్యాంకులు సరిహద్దుల్లో మోహరించాయి? అంటూ నకిలీ వార్త. నిరసనకారుడొకరు పోలీసు అధికారి వేలు కొరికేశాడంటూ తప్పుదోవపట్టించే ఫొటో. ఇది నిత్యం హాంకాంగ్‌లో విస్తృతంగా చెలామణి అవుతున్న నకిలీ వార్తల భాగోతం. చివరికి ఇవి ఎక్కడికి దారితీస్తున్నాయంటే.. అధికారులను, ప్రజలను అయోమయానికి గురిచేయడంతోపాటు వీధి పోరాటాలకు కారణమవుతున్నాయి. గొడవలే కాదు ఏకంగా సమాజం రెండుగా చీలిపోయే ప్రమాదం దాపురించింది. హాంకాంగ్‌లో ఇటీవల ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాలు ఉవ్వెత్తున్న సాగాయి. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే నిరసనలకు సంబంధించి ఆన్‌లైన్‌లో వచ్చిన వందతులు, బోగస్ కథనాలు ఉద్యమాన్ని తప్పుదోవపట్టించడమే కాకుండా అయోమయానికి గురిచేశాయి. పాత వీడియోలను మార్చేసి, ఫొటోలను మార్ఫింగ్ చేసేసి జనాల్లోకి వదిలేస్తారు. ఎప్పుడో జరిగిన ర్యాలీలు, ఫొటోలకు విపరీతపైన ప్రచారం కల్పిండం ద్వారా ప్రజల్లో ఓ రకమైన భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. వీటి వల్ల హాంకాంగ్ పౌరుల్లో వైషమ్యాలు పెరిగిపోవడంతో పాటు రాజకీయ చీలికను అనివార్యమవుతున్నాయి. అవాస్తవ, అభూత కల్పనలు వండివార్చడం ద్వారా కొన్ని సార్లు ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఉదాహరణకు ఇలాంటి నకిలీ వార్త కథనాలు కొన్ని.. సరిహద్దుల్లోకి చైనా యుద్ధ ట్యాంకుల కాన్వాయ్ తరలివస్తున్నట్టు చూపే ఫుటేజ్. హాంకాంగ్ పౌరులను అణచివేయడానికే ఇదంతా జరుగుతోందని, రక్తపాతం తప్పదంటూ ట్వీట్టర్‌లో ఎవరో పోస్టు చేస్తే క్షణాల్లో ఎనిమిది లక్షల మంది వీక్షించా రు. అంతే ఒకటే అయోమయం. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దని చెప్పడానికి హాంకాంగ్ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా లో ఓ వార్తకథనం వెలువడింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ0 బలగాలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మోహరించాయని నకిలీ వార్త ప్రసారమైంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నకిలీ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పోలీసులు ఓ మహిళ ముఖంపై కాల్పులు జరిపారన్న వార్త కలకలం రేపింది. ఇలాంటి వదంతులు పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా గొడవలకు కారణమవుతున్నాయని హాంకాంగ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసుల విధులకు నకిలీలు ఆటంకంగా మారాయని అధికారులు వాపోతున్నారు.