అంతర్జాతీయం

ప్రపంచ కప్ గెలిచినట్లుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 25: ‘క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచినట్లుంది’.. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆయన వైట్ హౌస్‌లో ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో విస్తృత చర్చలు జరిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడితో తాను జరిపిన చర్చలు, వాటి సానుకూల ఫలితాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ‘నేను అధికార పర్యటనపై వెళ్లలేదు.. పాకిస్తాన్‌కు క్రికెట్ వరల్డ్ కప్‌నే తీసుకొచ్చా’ అని అన్నారు. తాను ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలోని అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దానని.. గతంలో ‘దొంగల’ పాలపడ్డ వీటిని పరిరక్షించానని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. గత పాలకులు విదేశాల్లో దాచుకొన్న పాకిస్తాన్ సంపదను వెనక్కి ఇవ్వాలని.. ఈ విషయంలో తనకు సహకరించాలని అమెరికా అధ్యక్షుడిని, ఇతర పశ్చిమ దేశాలను కోరినట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎవరికీ తలవంచనని.. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్తాన్ పాస్‌పోర్టును ప్రపంచ దేశాలు గౌరవించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ప్రపంచంలోనే ఓ గొప్ప దేశంగా పాకిస్తాన్‌ను తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలిపారు.