అంతర్జాతీయం

వచ్చే నెలలో భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీవ్, ఆగస్టు 6: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పలు అంశాలపై నెతన్యాహూ చర్చలు జరుపుతారని ఇజ్రాయెల్ సీనియర్ మంత్రి ఒకరు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. భారత రియాల్టీ సంస్థ క్రెడాయ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఇజ్రాయెల్ గృహ నిర్మాణ సంస్థ మంత్రి రుూఫాత్ షాషా-బిటాన్ మాట్లాడారు. నిర్మాణ రంగంలో భారత్‌తో బాగస్వాములమవుతామని ఆమె వెల్లడించారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రధాని నెతన్యాహూ వచ్చేనెలలో భారత్‌లో పర్యటించనున్నట్టు బిటాన్ తెలిపారు. ప్రపంచంలోనే భారత్ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా విరాజిల్లుతోందని ఆమె ప్రశంసించారు. తమ దేశీయులు యూదులెవరూ అక్కడ వేధింపులకు గురయిన సంఘటనలు లేవని ఆమె స్పష్టం చేశారు. కాగా నెతన్యాహూ సెప్టెంబర్ 9న భారత్ వెళ్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగినా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో సెప్టెంబర్ 17న మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా నెతన్యాహూ భారత్‌లో పర్యటించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిన రికార్డు ఆయనకుంది. దేశ తొలి ప్రధాని డేవిడ్ బెన్-గురియోన్ రికార్డును నెతన్యాహూ అధిగమించారు. ప్రధాని ఈసారి రాజకీయంగా గట్టి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. ఆయన నాయకత్వంలోని లీకుడ్ పార్టీ భవితవ్యం వచ్చేనెలలో తేలిపోనుందని హారెట్జ్ కాలమిస్ట్ యూస్సీ వెర్టెర్ అన్నారు. నిజానికి ఇద్దరు ప్రధానులు ఫిబ్రవరి 11న భేటీ కావల్సి ఉంది. అంటే భారత్‌లో ఎన్నికల ముందే పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల నెతన్యాహూ తన పర్యటనను రద్దుచేసుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు, ఎన్నికల ప్రకటన వెలువడడంతో పర్యటన రద్దయింది. కాగా నెతన్యాహూ 2018 జనవరిలో భారత్‌లో పర్యటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ 2017లో టెల్ అవీవ్ సందర్శించారు. యూదు రాష్ట్రంలో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. విమానాశ్రయంలో భారత ప్రధానికి నెతన్యాహూ ఘన స్వాగతం పలికారు. ఆగస్ట 4న స్నేహితుల దినోత్సవం సందర్భంగా మోదీ, నెతన్యాహూ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.