అంతర్జాతీయం

ఐరాస హక్కుల మండలికీ వెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 21: కాశ్మీర్ వ్యవహారాన్ని సాధ్యమైనంతగా అంతర్జాతీయ సమస్యగా సృష్టించేందుకు పాకిస్తాన్ తన ప్రయత్నాలను మాత్రం మానలేదు. భద్రతా మండలిలో చుక్కెదురు కావడంతో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని వెల్లడించిన పాకిస్తాన్ మరో అడుగు ముందుకు వేసి, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో కూడా దీనిని లేవనెత్తేందుకు పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ బుధవారంనాడు ఇక్కడ వెల్లడించారు. సెనేట్ కమిటీ ముందు హాజరైన ఆయన కాశ్మీర్‌పై ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై అనేక అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. తాజాగా, ఐరాస మానవ హక్కుల మండలిలో కూడా దీనిని లేవనెత్తుతామని, ఇదీ కాకపోతే ఇస్లామిక్ సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా కాశ్మీర్‌ను ప్రస్తావిస్తామని అన్నారు. ఆధీనరేఖ పొడవునా భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఇరు దేశాలు పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూస్తున్నాయని తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ, నార్వే విదేశాంగ మంత్రి ఎరిక్సన్ సూరిడేతో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. కాశ్మీర్ అంశంపైనే ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో అమలవుతున్న ఆంక్షలను సడలించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా ఆయన నార్వేను కోరారు. అయితే, ఉద్రిక్తతలను పెంచకుండా పరస్పర సహకారంతో మెసలాలని రెండు దేశాలను కోరతామని నార్వే ఈ సందర్భంగా తెలిపింది.