అంతర్జాతీయం

భారత్ - ఇస్టోనియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టల్లిన్ (ఇస్టోనియా), ఆగస్టు 21: ఈరోపియన్ యూనియన్‌లో భాగస్వామ్య దేశమైన ఇస్టోనియా - భారత్‌ల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారం మరింత బలపడే దిశగా బుధవారం అంగీకరానికి వచ్చాయి. ముఖ్యంగా ఐటీ, ఈ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా దోహదపడేందుకు వీలుగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎస్టోనియా అధ్యక్షుడు కెర్‌స్టీ కల్జూలియాద్ చర్చలు జరిగాయి. లూథియానా, లాట్వియా, ఇస్టోనియా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం వెంకయ్యనాయుడు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇస్టోనియా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఉప రాష్టప్రతి పర్యటనలో ముఖ్యమైన రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన దిశగా ద్వైపాక్షిక చర్చలు సాగాయి. ప్రాంతీయ, ఇతర దేశాలతో సహకారం తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ‘ఇస్టోనియాలో పర్యటించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నా.. ప్రజాస్వామ్య దేశంగా ఎస్టోనియా విజయం సాధించింది.. యూరోపియన్ యూనియన్‌లో భాగస్వామ్య దేశంగా ఉన్న ఇస్టోనియా డిజిటల్ దేశంగా గుర్తింపు పొందింది.. సాంకేతికంగా ఎన్నో విజయాలను ఇస్టోనియా కైవసం చేసుకొంది’ అని ఒక సంయుక్త ప్రకటనలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ, స్వతంత్రత తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని వెంకయ్య చెప్పారు. ఇరు దేశాలూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో ముఖ్యంగా ఐటీ, ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, విద్యా తదితర రంగాల్లో సంపూర్ణ సహకారానికి ఇరు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
చిత్రం... ఇస్టోనియా స్వాతంత్య్ర సమరయోధులకు వబుదూస్ స్వ్కేర్ వద్ద బుధవారం నివాళులు అర్పిస్తున్న భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు