అంతర్జాతీయం

గోదాంలో మంటలంటుకొని 16 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఆగస్టు 27: రష్యా రాజధాని మాస్కో నగరం ఉత్తర ప్రాంతంలో శనివారం ఉదయం ఒక గోదాంలో ఎగిసిపడిన మంటల్లో 16మంది మృతి చెందారు. మంటలను ఆర్పివేసిన తరువాత అక్కడ గోదాంలో విడిగా ఒక గది కనపడిందని అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రెస్ సర్వీస్ ప్రాంతీయ శాఖను ఉటంకిస్తూ ‘టాస్’ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది ఆ గది గోడను పగులగొట్టి చూడగా లోపల 16మంది మృతి చెంది ఉన్నారు.
మాస్కోలోని ఇండిస్ట్రియల్ జోన్‌లో గల ఈ గోదాంలో 200 చదరపు మీటర్ల విస్తీర్ణం మేరకు మంటలు వ్యాపించాయి. అంతర్జాతీయ కాలమానం (జిఎంటి) ప్రకారం ఉదయం అయిదు గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపా టు శ్రమించి మంటలను ఆర్పివేసినట్లు అధికారులు చెప్పారు. మంటలంటుకున్న గోదాం స్థానిక ప్రింటింగ్ కంపెనీకి చెందిందని, మృతులు మాజీ సోవియట్ రిపబ్లిక్‌ల నుంచి వలసవచ్చిన వారని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనపై విచారణ జరిపిస్తామని మాస్కో మేయర్ సెర్‌జెయి సోబ్యానిన్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో తెలిపారు. అయితే మంటలు అంటుకోవడానికి దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. అజాగ్రత్తవల్ల మంటలు అంటుకున్నాయా? లేక ఎవరైనా కావాలనే అంటించారా? అనే విషయమై క్రిమినల్ దర్యాప్తు ఇప్పటికే మొదలయింది.