అంతర్జాతీయం

కాశ్మీర్ వివాదంలో జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 1: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించారు. కాశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారించడానికి ఒక నిజనిర్ధారణ మిషన్‌ను పంపించాల్సిందిగా కోరుతూ ఆయన ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరీ జనరల్ బాన్ కి మూన్‌కు లేఖ రాశారు. నెల రోజులలోపు ఆయన ఇలా లేఖ రాయడం ఇది రెండోసారి. కాశ్మీర్‌లో దిగజారుతున్న పరిస్థితి గురించి షరీఫ్ తన లేఖలో ఐరాస చీఫ్‌కు తెలియజేశారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా చెప్పారు. కాశ్మీర్‌లో మళ్లీ హింస తలెత్తకుండా చూడాలని బాన్ కి మూన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా షరీఫ్ ఈ లేఖ రాశారని ఆయన తెలిపారు. ‘్భయంకరమైన పరిస్థితుల విషయంలో ‘ఆజాద్ కాశ్మీర్’, జమ్మూకాశ్మీర్‌లను పోల్చజాలమని, జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కులు తీవ్రంగా దిగజారాయని షరీఫ్ పేర్కొన్నారు. యుఎన్‌ఎంఒజిఐపి (యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్), విదేశీ దౌత్యవేత్తలు, పర్యాటకులు ఎప్పుడైనా సందర్శించడానికి వీలుంది. అందువల్ల ఐరాస మిషన్ సందర్శనకు ద్వారాలు తెరచి ఉన్నాయని షరీఫ్ తన లేఖలో పేర్కొన్నారు’ అని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. బెలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)ల గురించి ప్రస్తావించే అధికారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని, అలా ప్రస్తావించడం ఐరాస చార్టర్‌కు పూర్తిగా విరుద్ధమని షరీఫ్ తన లేఖలో పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న అత్యాచారాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి మోదీ ఆ వ్యాఖ్యలు చేశారని షరీఫ్ తన లేఖలో పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ప్రధాన వివాదం కాశ్మీర్ అంశమేనని పేర్కొంటూ ఈ వివాద పరిష్కారానికి ఐరాస జోక్యం చేసుకోవలసిందిగా బాన్ కి మూన్‌ను షరీఫ్ కోరారు. పాకిస్తాన్ ఇకముందు కూడా అన్ని అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతుందని నఫీజ్ జకారియా తెలిపారు. రానున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ వివాదం ప్రధాన అంశంగా ఉండబోతోందన్నారు.