అంతర్జాతీయం

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, సెప్టెంబర్ 22: పెరుగుతున్న భారత ఇంధన అవసరాలను తీర్చుకునే అంశంపై అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు కంపెనీల సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఈ రెండు రంగాల్లో ఉన్న అవకాశాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై వీరితో ఆయన చర్చించారు. ఇంధన భద్రత, పరస్పర పెట్టుబడులను పెంపొందించుకోవడంపై ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉభయతారకమైన రీతిలో మంతనాలు జరిగాయని అనంతరం మోదీ ట్వీట్ చేశారు. హోస్టన్ వచ్చి, ఇంధన అంశంపై చర్చించకుండా ఉండడం అసాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ఇంధన రంగానికి చెందిన సీఈఓలందరితోనూ తాను జరిపిన చర్చలు సుహృద్భావ రీతిలో సాగాయని, వారం రోజుల పాటు అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ఇక్కడకు వచ్చారు. ఈ సమావేశంలో 17 అంతర్జాతీయ ఇంధన కంపెనీల సీఈఓలు పాల్గొన్నారని భారత విదేశాంగ విభాగం ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
ఈ 17 కంపెనీలు 150 దేశాల్లో పనిచేస్తున్నాయని, వీటి ఉమ్మడి విలువ ట్రిలియన్ డాలర్లకు పైనేనని ఆయన వివరించారు. ఈ కంపెనీలన్నింటిలోనూ భారత్‌కు ఏదో ఒకవిధమైన సంబంధం ఉందని ఆయన తెలిపారు. మోదీ సమక్షంలోనే ఈ సందర్భంగా అమెరికా ఇంధన కంపెనీ హెలూరియన్‌తో భారత్‌కు చెందిన పెట్రోనెట్ ఎల్‌అండ్‌జీ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలు 2020 మార్చి 31 నాటికి ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటాయి. ఈ సమావేశంలో మాట్లాడిన అమెరికా సీఈఓలు భారత్‌లో ఇటీవల వచ్చిన మార్పులను ప్రశంసించారు. కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం మరింతగా ద్వారాలు తెరవడం వంటి మోదీ సర్కారు నిర్ణయాలను వీరు ప్రధానంగా ప్రస్తావించారని రవీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ సీఈఓలు భారత్ ప్రధాని మోదీకి కొన్ని సూచనలు చేశారని, వాటన్నింటిపైనా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
*చిత్రం... అమెరికా ఇంధన రంగానికి చెందిన సీఈఓలతో సమావేశానంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ