అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పోరుకు ముమ్మర యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు తీవ్రతను ఐక్యరాజ్య సమితి సభ్యులు గుర్తించాలని, అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఉగ్రవాద సమస్యపై పోరాడేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేయాలని ప్రపంచ దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదం వలన ప్రపంచానికి ఎదురవుతున్న పెనుముప్పును, దాని తీవ్రతను గుర్తించి ఈ సమస్యపై గట్టిగా పోరాడేందుకు మనం రెట్టింపు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని భారత్ ఐక్యరాజ్య సమితికి, సభ్య దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది’ అని ఐక్యరాజ్య సమితిలో భారత సీనియర్ దౌత్యాధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ శుక్రవారం ఇక్కడ ‘సాంస్కృతిక శాంతి’పై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టం చేశారు. ఉగ్రవాద సమస్యపై ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందాన్ని (సిసిఐటి) ఆమోదించడం ద్వారా ఈ సమస్యపై పోరాడేందుకు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
.